03-12-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ నందు తేదీ 03-12-2025 న రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ వాకటి విజయ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీ చామర్తి జనార్ధన్ రాజు గారి తో కలిసి స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ సామాజిక కార్యకర్త అయినటువంటి శ్రీమతి ఐ. దీపా వెంకట్ గారు రెడ్ క్రాస్ నిర్వహిస్తున్నటువంటి వివిధ ప్రాజాక్టులను సందర్శించారు. ఈ సంధర్భంగా మొదటగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోని ఎమ్మెస్సార్ స్పాస్టిక్స్ సెంటర్ ను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులతో సరదాగా సంభాషించడం జరిగింది ప్రతి తరగతి గదిని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు నిర్వహించే వివిధ రకాల థెరపీల గురించి, ప్రత్యేక విద్య గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెడ్ క్రాస్ నిర్వహిస్తున్నటువంటి తలసేమియా ప్రాజెక్ట్ ను సందర్శించారు. నెల్లూరు రెడ్ క్రాస్ నందు వంద మందికి పైగా తలసేమియా పిల్లలకు రెగ్యులర్ గా పూర్తి ఉచితంగా రక్తమార్పిడి జరుగుతున్నది మరియు తలసీమియా వ్యాది కలిగిన చిన్నారులకు bone marrow transplantation ద్వారా మాత్రమే తలసేమియా వ్యాది పూర్తిగా నయమవుతుందని ఆ ప్రాజెక్ట్ కన్వీనర్ అయినటువంటి డాక్టర్ సీత గారు తెలియచేసారు. అనంతరం రెడ్ క్రాస్ నందు వున్న బ్లడ్ సెంటర్ ను సందర్శించి రెడ్ క్రాస్ చేస్తున్న సేవలను కొనియాడారు. రాబోవు రోజులలో రెడ్ క్రాస్ కు తన వంతు సహాయ సహకారాలను అందిస్తామని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కోశాధికారి శ్రీ సురేష్ కుమార్ జైన్, రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్, శ్రీ కలికి శ్రీహరి రెడ్డి, శ్రీ యాలమూరి రంగయ్య నాయుడు, తలసేమియా సేవ మెంబర్ శ్రీమతి షేక్ పర్వీన్, డాక్టర్ హరిత, డాక్టర్ యశోవర్ధన్, రెడ్ క్రాస్ సిబ్బంది మరియు జీవిత కాల సభ్యులు పాల్గొన్నారు.

📘 4 January 2024, World Braille Day
07-05-2025

Leave A Comment

All fields marked with an asterisk (*) are required