10-11-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ, బ్లడ్ సెంటర్ నందు తేదీ 10-11-2025 సెయిల్ ఎనర్జి ఇండియా లిమిటెడ్ వారు అత్యంత అధునాతనమైన Refrigerated Centrifuge Machine (రక్త భాగాల విభజన) ను రాష్ట్రం లోనే మొదటగా ఛైర్మన్ శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి సమక్షంలో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కు విరాళంగా అందచేసారు. ఈ సంధర్భంగా సెయిల్ కంపెనీ ఛైర్మన్ శ్రీ తారెక్ మహమ్మద్ వారి శ్రీమతి శ్రీ నదియా ఆల్ బటాషి, డైరెక్టర్ శ్రీ సైరస్ ఎరచ్ కూపర్ వారి శ్రీమతి శ్రీ షేర్ణ కూపర్, CEO శ్రీ జే.మహాపాత్ర వారి శ్రీమతి శ్రీ పుస్ప మహాపాత్ర వారు రెడ్ క్రాస్ లో చేస్తున్నంటువంటి సేవలను మరియు ప్రాజెక్టు లను చూసి రాబోవు రోజులలో వారి సహాయ సహకారాలని అందచేస్తామని తెలియచేసారు.
అనంతరం తలసేమియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ Dr. సీత, బ్లడ్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ dr. యశోవర్ధన్ గారిచే రెడ్ క్రాస్ ప్రాజెక్టు లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెయిల్ కంపెనీ ప్రతినిధులకు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ ఛైర్మన్ శ్రీ చమర్తి జనార్ధన్ రాజు, కోశాధికారి శ్రీ సురేష్ కుమార్ జైన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ బయ్యా ప్రసాద్, దాసరి రాజేంద్ర ప్రసాద్, కలికి శ్రీ హరి రెడ్డి, యడవలి సురేష్, తలసేమియా సేవ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీమతి షేక్ పర్వీన్, కాన్సర్ హోప్సిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ dr. టి లక్ష్మి, ARV క్లినిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ బిరుదువోలు వెంకురెడ్డి, బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ dr S. వర ప్రసాద్ మాజీ ఛైర్మన్ dr ఏ వి. సుబ్రమణ్యం, కంపెనీ ప్రతినిధులు, సిబ్బంది మరియు లైఫ్ మెంబర్స్ పాల్గొన్నారు

📘 4 January 2024, World Braille Day
07-05-2025

Leave A Comment

All fields marked with an asterisk (*) are required