13-10-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ లో గా MSR స్పాస్టిక్స్ సెంటర్ నందు తేదీ 13-10-2025 న నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ గారి ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ వారి ఉత్తర్వుల మేరకు CPR AWARENESS WEEK కార్యక్రమమును అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 17 వరకు జరపడం జరుగుంటుందని MSR స్పాస్టిక్స్ సెంటర్ కో ఆర్డినేటర్ శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్ మరియు మేనేజింగ్ కమిటీ సభ్యులు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఐనటువంటి ఈ రోజు స్పాస్టిక్స్ సెంటర్ నందు, ఉపాద్యాయులకు, పిల్లలకు వారి తల్లి తండ్రులకు మరియు రెడ్ క్రాస్ district ఆఫీసు సిబ్బందికి CPR (Cardio Pulmonary Recitation) గురించి రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ కో ఆర్డినేటర్ శ్రీ సుందర్ రాజు చే శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ సంధర్భంగా CPR అంటే ఆగిపోయిన గుండె మరియు ఊపిరితిత్తులు తిరిగి పనిచేసేలా చేయడాన్ని CPR అని అంటారు. ఈ విషయం గురించి కో ఆర్డినేటర్ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కొ-ఆర్డినేటర్ మరియు మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ బయ్యా ప్రసాద్, రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ సెక్రెటరీ శ్రీ పి. మస్తానయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు..

📘 4 January 2024, World Braille Day
07-05-2025

Leave A Comment

All fields marked with an asterisk (*) are required