24-10-2025

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు 24-10-2025 న నెల్లూరు నందు జనార్ధన రెడ్డి కాలనీ మరియు బాలాజీనగర్ నందు ఇటీవల సంభవించిన భారీ వర్షాల వల్ల ఇళ్లను కోల్పోయిన 6 బాధిత కుటుంబాలకు నెల్లూరు రెడ్ క్రాస్ టార్ఫాలిన్ పట్టలు, వంట పాత్రలు, దోమతెరలను మరియు మేనేజింగ్ కమిటీ మెంబర్ శ్రీ యాలమూరి రంగారావు గారి సహాయ సహకారములతో బాదిత కుటుంబాలకు బియ్యం బస్తాలను అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విపత్తు సమయంలో బాదితులకు ఎప్పుడు అండగా రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ ముందుంటుంది అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్-ఛైర్మన్ శ్రీ చామర్తి జనార్ధన రాజు, మేనేజింగ్ కమిటీ మెంబర్ & కాన్సర్ హాస్పిటల్ కొ-ఆర్డినేటర్ శ్రీ యాలమూరి రంగారావు మరియు మేనేజింగ్ కమిటీ మెంబర్ & డిజాస్టర్ మేనేజ్మెంట్ కొ-ఆర్డినేటర్ దాసరి రాజేంద్ర ప్రసాద్, రెడ్ క్రాస్ వాలంటీర్స్ మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

📘 4 January 2024, World Braille Day
07-05-2025

Leave A Comment

All fields marked with an asterisk (*) are required