18-10-2025
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ నందు ఈరోజు అనగా 18/10/2025 న బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించినారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే స్త్రీలలో అన్ని క్యాన్సర్ల కన్నా రొమ్ము క్యాన్సర్ ను ఎక్కువగా చూస్తున్నాము.
మన దేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంది.
పూర్వము 45 సంవత్సరాలు దాటిన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చుచుండెను. ప్రస్తుతం చిన్న వయసులోనే ఈ క్యాన్సర్ ను చూస్తున్నాము. మగవారిలో కూడా రొమ్ము క్యాన్సర్ ను చూస్తున్నాము. జీన్స్ వలన వచ్చే క్యాన్సర్లు 13% మాత్రమే.
ఇతర క్యాన్సర్ ల లానే ఈ క్యాన్సర్ ప్రస్తుతం జంక్ ఫుడ్ వలన, ఊబకాయం వలన, వ్యాయామం లేనందువలన ఎక్కువగా చూస్తున్నాము. ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా వాడటం కూడా కారణమే పిల్లలకు పాలు ఇవ్వకపోవడం వలన కూడా కొంతవరకు కారణమని చెప్పవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:-
20 సంవత్సరాల దాటిన తర్వాత ప్రతి ఒక్క స్త్రీ ఎవరికి వారు వారి రొమ్మును నెలకు ఒకసారి menses అయిన తర్వాత పరీక్షించు కోవలెను( Breast self examination ) ఎడమ చేతితో కుడి రొమ్మును కుడి చేతితో ఎడమ రొమ్మును సబ్బు పట్టించి స్నానం చేయనప్పుడు చూసుకోవలయును, పడుకొని కూడా చూసుకోవలెను. ఇలా చూసుకుని, రొమ్ములో ఎటువంటి మార్పులు ఉన్నను ఎవరికి వారు తెలుసుకొని వెంటనే వైద్యుని సంప్రదించవలెను.
30 సంవత్సరములు దాటిన స్త్రీలు సంవత్సరమునకు ఒకసారి రొమ్ము స్కాన్ చేయించుకొని డాక్టరు ను సంప్రదించ వలయును.
40 సంవత్సరాలు దాటిన స్త్రీలు సంవత్సరంలో ఒకసారి ఏమీ లేనప్పటికీ రొమ్ముకు మామోగ్రామ్ అనే ఎక్స్ రే ను తీయించు కొనవలయను.
ఈ జాగ్రత్తలు తీసుకొనిన ఎడల ప్రారంభ దశలోనే జబ్బును గుర్తించవచ్చును. మరియు వైద్యం చేయడం వలన రొమ్ము క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయవచ్చును.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ చైర్మన్ శ్రీ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, ఐ.ఆర్. సి. ఎస్. క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ సుపరింటెండెంట్ డాక్టర్ ఎం నాగేశ్వరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి. లక్ష్మీ, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మౌనిక రెడ్డి, రేడియాలజిస్ట్ డాక్టర్ హరిత రాణి, పెథాలజిస్ట్ డాక్టర్ నందిత, పేషంట్ కౌన్సిలర్ కన్యాకుమారి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ వెంకట భాస్కర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.