17-10-2025
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ వారి ఉత్తర్వుల మేరకు CPR AWARENESS WEEK లో భాగంగా తేదీ 17-10-2025 న నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలోనీ విద్యార్థులకు, సిబ్బందికి మరియు గంగవరం సమీపంలోని గీతాంజలి సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ లో సిపిఆర్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్ గారు అవగాహన కల్పిస్తూ మన నిత్యజీవితంలో ఏదో ఒక సందర్భంలో మన సమీపంలో ఎవరైనా గుండె సంబంధిత సమస్య ఏర్పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం సి పి ఆర్ గురించి అవగాహన కలిగి ఉండి ఆ వ్యక్తికి సిపిఆర్ చేయడం ద్వారా ఆ వ్యక్తి ప్రాణం పోసి పునర్జన్మను ప్రసాదించిన వాళ్ళం అవుతామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినీ, విద్యార్థులు, యువత ఇలాంటి అవగాహన కలిగి ఉండటం ద్వారా ధైర్యంగా ముందుకు వచ్చి ఇలాంటి అపాయకరమైన సంఘటనలు ఏర్పడినప్పుడు వారి యొక్క ప్రాణాలను కాపాడిన వారవుతారని తెలిపారు. అనంతరం డిజాస్టర్ కోఆర్డినేటర్ సుందర్ రాజా విద్యార్థులకు, సిబ్బందికి డెమో ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నవీద్ అక్తర్, నారాయణ ఇంజనీరింగ్ కళాశాల NCC కోఆర్డినేటర్ శ్రవణ్, ఆయుష్ విభాగం వైద్యురాలు కోమలి గీతాంజలి సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల NCC కోఆర్డినేటర్ మురళీకృష్ణ గారు ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది.