15-10-2025

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేదీ15/10/2025 ఇండియన్ రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ చైర్మన్ శ్రీ వాకటి విజయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలను ఇండియన్ రెడ్ క్రాస్ స్పాస్టిక్ సెంటర్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్పాస్టిక్ సెంటర్ కోఆర్డినేటర్ శ్రీ దాసరి రాజేంద్రప్రసాద్ గారు మరియు నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ శాఖ కార్యదర్శి పి. మస్తానయ్య గారి చేతుల మీదుగా అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాల వేసి రెడ్ క్రాస్ స్టాస్టిక్స్ సెంటర్ సిబ్బంది, స్పాస్టిక్ సెంటర్ చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులతో కలిసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసరి రాజేంద్రప్రసాద్ గారు ప్రసంగిస్తూ
మిసైల్‌ మ్యాన్‌గా, భారత రాష్ట్రపతిగా అంతకు మించి ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా డా. ఏపీజే అబ్దుల్ కలాం గారుచరిత్రలో నిలిచిపోయారాని అలాగే కలాం గారు ఎల్లప్పుడూ విద్యార్థుల, యువత ఆలోచనలను తనతో పంచుకునే వారని విద్యార్థుల యువత ఆలోచనలు ఈ దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడతాయని అబ్దుల్ కలాం గారు పలు సందర్భాలలో చెప్పేవారని తెలిపారు అందుచేతనే అబ్దుల్ కలాం జయంతిని స్టూడెంట్స్ డే గా నిర్వహించుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ పి. మస్తానయ్య గారు, ఫిజియోథెరపీ సిబ్బంది, ఇతర రెడ్ క్రాస్ సిబ్బంది స్పాస్టిక్ సెంటర్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది.

📘 4 January 2024, World Braille Day
07-05-2025

Leave A Comment

All fields marked with an asterisk (*) are required