SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీ హిమాన్షు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రెడ్ క్రాస్ వాడ వాడలా సేవలను ఈ రోజు 09-01-2026 న VRC సెంటర్ YSR కూల్ డ్రింక్స్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రక్తదాన ప్రేరేపకులు తిక్కవరపు సుకుమార్ రెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. రెడ్ క్రాస్ వాడ వాడల సేవలను ప్రజలు బ్లడ్ గ్రూపింగ్ , హిమోగ్లోబిన్ శాతం చెక్ చేపించుకొని వాలంటరీగా రక్తదానం చేసారు ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ చైర్మన్ వాకటి విజయ కుమార్ రెడ్డి గారు మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు బయ్యా ప్రసాద్ , యడవల్లి సురేష్ బాబు , దాసరి రాజేంద్ర ప్రసాద్ , సెక్రటరీ మస్తానయ్య పాల్గొన్నారు