07-01-2026
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీ రాములు జిల్లా శాఖ నందు తేదీ 07-01-2026 న రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు శ్రీ జీన్ హెన్రి డ్యూనాంట్ గారి విగ్రహ ఆవిష్కరణ నెల్లూరు జిల్లా కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ హిమాన్షు శుక్లా IAS గారిచే ప్రారంబించబడినది. ఈ సందర్భంగా విగ్రహ దాత అయినటువంటి శ్రీ కలికి శ్రీహరి రెడ్డి కోఆర్డినేటర్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ వారిని కలెక్టర్ గారు ప్రత్యకంగా ప్రశంసించారు. అనంతరం రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రం లో జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవ కార్యక్రమ వేడుకలు (డా. JG జోలీ గారి జన్మదినం) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ హిమాన్షు శుక్లా IAS గారు విచ్చేసి అత్యధిక సార్లు రక్త దానం చేయించిన రక్త ప్రేపరకులకు 135 మందికి (మోటివేటర్స్) జ్ఞాపికలు మరియు ప్రశంసా పత్రాలను అందచేయడం జరిగింది.
ముందుగా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా IAS గారు, చైర్మన్ శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీ చమర్తి జనార్ధన్ రాజు, కోశాధికారి శ్రీ సురేష్ కుమార్ జైన్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ డి. రవి ప్రకాష్ రక్త నిధి కో ఆర్డినేటర్ మరియు మేనజింగ్ కమిటీ మెంబర్ శ్రీ బయ్యా ప్రసాద్ మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ కలికి శ్రీహరి రెడ్డి, శ్రీ యడవలి సురేష్, శ్రీ గుణపాటి ప్రసాద్ రెడ్డి, శ్రీ యాలమూరి రంగయ్య నాయుడు మరియు శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి జీన్ హెన్రి డ్యూనాంట్ మరియు డాక్టర్ డా. JG జోలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్, తలసేమియా, రక్తనిధి మరియు వివిధ రకాల ప్రాజెక్టుల ద్వారా చేస్తున్న సేవలను గురించి తెలుసుకుని రెడ్ క్రాస్ ఛైర్మన్ ను అభినందించారు.
అనంతరం ఛైర్మన్ శ్రీ వాకటి విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రక్త నిధికి రాష్ట్ర స్థాయిలో ఒక విశిష్ట స్థానం వుందని, నెల్లూరు జిల్లాలో ఎటువంటి విపత్తులు ఎదురైన మేము వున్నామని ధైర్యాన్ని కలిగించి వారికి ఆపన్న హస్తమును అందిస్తున్నారని ఇంతమంది రక్త ప్రేరపకులకు (మోటివేటర్స్) రెడ్ క్రాస్ లో చూడడం ఆనందాన్ని కలిగిస్తుందని తెలియచేసారు.
అనంతరం శ్రీ బయ్యా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది అని మరియు రాష్ట్రములో రక్త నిల్వలు కొరత వలన ఇంకా అనేక మందికి రక్తము అవసరం ఉన్నందున యువత రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మరింతగా మెరుగైన సేవలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా వాడ వాడల రెడ్ క్రాస్ సేవలు (రక్త గ్రూప్ నిర్ధారణ పరీక్షలు) అనే కార్యక్రమమును ఉచితంగా రెడ్ క్రాస్ ద్వారా పరీక్షలు చేస్తామని కలెక్టర్ గారి సమక్షంలో తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మాజీ ఛైర్మన్ డా. ఎ. వి. సుబ్రమణ్యం, శ్రీ యండి. జూబేర్ మాజీ కన్వీనర్ క్యాన్సర్ హాస్పిటల్, రెడ్ క్రాస్ సెక్రెటరీ శ్రీ పి. మస్తానయ్య మరియు జీవితకాల సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.