ఘనంగా IRCS క్యాన్సర్ హాస్పిటల్ రజితోత్సవ వేడుకలు….
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ నిర్వహిస్తున్న పొదలకూరు రోడ్ నందు గల క్యాన్సర్ హాస్పిటల్ రజితోత్సవ కార్యక్రమం మరియు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం లో నెల్లూరు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ గౌరవ చైర్మన్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా మొదట జ్యోతి ప్రజ్వలన గావించి, సావనీర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2001 లో 6 మందితో ప్రారంభించిన క్యాన్సర్ హాస్పిటల్ నేడు 150 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందిందని దీనికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తదనంతరం క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళాలు అందించిన దాతలకు సన్మానం చేశారు.. దాతలు శ్రీహరి రెడ్డి కోటి రూపాయలు ప్రకటించారు, శ్రీ యాలమూరి రంగయ్య నాయుడు ఐదు రూములు హాస్పిటల్ నిర్మాణానికి సహాయం చేస్తున్నట్టు ప్రకటించారు. దాతలు జెఎస్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్, భగవాన్ మహావీర్ ట్రస్ట్, సుమంత్ రెడ్డి, దొడ్ల స్వాతి, సెయిల్ కంపెనీ లిమిటెడ్ మేనేజర్ శ్రీ ఆల్బర్ట్ డేవిడ్ పీటర్ , సీతారాములు, తదితర దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు వై.డి. రామారావు, ఉపాధ్యక్షుడు రామచంద్ర రాజు, కోశాధికారి శ్రీహరి రావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీ చమర్తి జనార్ధన్ రాజు, కోశాధికారి శ్రీ సురేష్ కుమార్ జైన్, క్యాన్సర్ హాస్పిటల్ కో ఆర్డినేటర్ శ్రీ యా లమూరి రంగయ్య నాయుడు రాష్ట్ర శాఖ మేనజింగ్ కమిటీ సభ్యులు శ్రీ డాకారపు రవి ప్రకాష్ మేనజింగ్ కమిటీ సభ్యులు శ్రీ కలికి శ్రీ హరి రెడ్డి, శ్రీ ఎడవల్లి సురేష్, శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్, శ్రీ బయ్యా ప్రసాద్ శ్రీ గుణపాటి ప్రసాద్ రెడ్డి, దాతలు శ్రీ వెంకటేష్ రంగాచారి, క్యాన్సర్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి. లక్ష్మి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యం. నాగేశ్వరరావు, ముత్తు, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు దాతలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..